పప్పు దినుసులు, నూనె గింజల్లో భారత్‌కు ఏ లోటు లేదు : వ్యవసాయ శాఖ మంత్రి

భారత దేశంలో నూనె గింజలు, పప్పు దినుసులు స్వయం సమృద్ధిగా ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ తెలిపారు. రానున్న సంవత్సరాల్లో పప్పులు, నూనె గింజల కోసం ఎవరి మీదా ఆధారపడాల్సిన అవసరం లేదని ఆయన వివరించారు.

ప్రభుత్వం ఈ రంగంలో పంట దిగుబడి పెరిగేందుకు, నాణ్యత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తోందన్నారు.

భారత్ ప్రతి ఏడా 5 మిలియన్ టన్నుల పప్పు ధాన్యాలు, 14.5 మిలియన్ టన్నుల శాఖాహార నూనెలు దిగుమతి చేసుకుంటుంది.
న్యూఢిల్లీలో ఆదివారం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఎఆర్) 89వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022 నాటికి దేశంలోని రైతుల ఆదాయాన్ని రెండు రెట్లు పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు.

కేవలం వ్యవసాయ ఉత్పత్తులపైనే కాకుండా రైతుల ఆదాయాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుందని ఆయన వివరించారు.