పార్లమెంట్, అసెంబ్లీ హౌసుల్లో నేడు జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలు

నూతన రాష్ట్రపతి ఎన్నికలు నేడు జరుగుతున్నాయి. ఎన్డీఎ ప్రభుత్వ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్, ప్రతిపక్ష అభ్యర్థి మీరా కుమార్‌ల మధ్య ముఖాముఖి పోటీ జరగనుంది.

గురువారం ఓట్ల లెక్కింపు ఉంటుంది. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం ఈ నెల 24తో ముగియనుంది. పోలింగ్ కోసం పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

మొత్తం 4,896  ఓటర్లలో 776 ఎంపీలు, 4,120 ఎంఎల్యేలు ఉన్నారు.  సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఈ ఎన్నికలు జరుగుతాయి. కానీ  ఫలానా అభ్యర్థికే ఓటు వేయాలని రాజకీయపక్షాలు తమ పార్టీ సభ్యులకు విప్‌ను జారీ చేసే అవకాశం లేదు. గురువారం మనదేశ నూతన రాష్ట్రపతి ఎవరో తేలిపోతుంది.