భారీవర్షాలు, వరదలతో గుజరాత్‌లో 15 మంది మరణం

భారీ వర్షాలు, వరదలు కారణంగా గత మూడు రోజుల్లో గుజరాత్‌లో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. జమ్నానగర్ జిల్లాలోని జోడియా గ్రామంలో వరదల్లో చిక్కకున్న 20 మందిని ఎన్‌డి ఆర్ ఎఫ్ బృందాల రక్షించాయి. దీంతో ఇప్పటివరకూ 405 మందిని వరదల నుంచి కాపాడారు. అత్యవసర సేవలు అందించేందుకుగాను  ఐదు ఎన్‌డి ఆర్ ఎఫ్ బృందాలు సైతం సిద్ధంగా ఉన్నాయి.

వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లోని ప్రజలకు ఆహార పదార్థాలు, మందులు, మంచినీళ్లు వంటి అత్యవసర వస్తువులను వెంటవెంటనే అందిస్తున్నారు. గుజరాత్‌లోని పలు డామ్స్, నదులు ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తుస్నదృష్ట్యా స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.