సిక్కిం మాజి ముఖ్యమంత్రి నార్ బహదుర్ భండారీ మృతి

సిక్కిం మాజి ముఖ్యమంత్రి నార్ బహదుర్ భండారీ (76) ఆదివారం న్యూఢిల్లిలో తుదిశ్వాస విడిచారు. మూడు పర్యాయాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న భండారీ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరణించారు.

భండారీ సిక్కిం సంగ్రామ్ పరిషత్ వ్యవస్థాపకులు. 19791994 వరకూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు.

ప్రస్తుత ముఖ్యమంత్రి పవన్ ఛామ్లింగ్ భండారీ  మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ దేశం గర్వించదగ్గ నాయకుడని అన్నారు.

హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా భండారి మృతికి సంతాపం వ్యక్తంచేశారు.