అన్ని రంగాల్లో భారత్ అభివృద్ధి కేతనం: సుష్మా స్వరాజ్

భారతదేశం పరిణితి చెందిన ప్రజాస్వామ్య దేశంగా కేంద్ర విదేశ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ అన్నారు. అంతేకాదు అన్ని రంగాల అభివృద్ధిలోనూ భారతదేశం ఆల్‌రౌండర్‌ కూడా అని వ్యాఖ్యానించారు.

70 సంవత్సరాల భారత స్వాతంత్య్ర దినోత్సవంను పురస్కరించుకుని ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు.

మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ప్రతి ప్రధాని దేశాభివృద్ధికి తమ వంతు కృషిచేశారన్నారు.

భారత్ అభివృద్ధి నుంచి పొరుగుదేశాలు కూడా లబ్దపొందాలని ప్రధాని నరేంద్ర మోది భావిస్తున్నారన్నారు.

నేపాల్ ప్రజాస్వామ్య మార్గం పట్టడం పట్ల ఆనందాన్ని వ్యక్తంచేస్తూ భవిష్యత్తులో మంచి పురోగతి సాధించాలని ఆశాభావాన్ని వ్యక్తంచేశారు.

ఈ సమావేశంలో నేపాల్ ప్రధాని షేర్ బహదుర్ దెబా, స్పీకర్ అనాసరి ఘారీత, భారత రాయబారి మంజీవ్ సింగ్ పురి, నటి మనీషా కొయిరాలా, పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.