ఆధార్-పాన్ కార్డుల అనుసంధానానికి ఎలాంటి గడువు నిర్ణయించలేదు : జైట్లీ

ఆధార్-పాన్ కార్డుల అనుసంధానానికి ఎలాంటి గడువును నిర్దేశించలేదని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం లోకసభలో తెలిపారు.

ఒక ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ ఈ రెండు కార్డుల లింకేజీకి తాము ఎలాంటి నిర్ణీయ సమయాన్ని నిర్ధారించలేదని స్పష్టం చేశారు.

కాగా జూన్ 28 నాటికి దేశంలో 25 కోట్ల పాన్ కార్డుహోల్డర్లు ఉన్నారనీ ఆయన సభకు వివరించారు.