ఈ ఏడాది 7.5 శాతం పెరుగుదల టార్గెట్ సాధించడం కష్టమన్న ఎకనామిక్ సర్వే వాల్యూమ్

2016-17 సంవత్సరానికి సబంధించిన ఎకనామిక్ సర్వే వాల్యూమ్-2ను శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది టార్గెట్‌గా పెట్టుకున్న 7.5 శాతం పెరుగుదల సాధించడం కష్టమేనని  ఈ రిపోర్టులో ఎకనామిక్  సర్వే పేర్కొంది. రైతుల రుణమాఫీ, రూపాయి విలువ, జిఎస్టి అమలులో తలెత్తిన తాత్కాలిక సమస్యల కారణంగా టార్గెట్ పెరుగుదలను ఈ ఏడాది సాధించడం కష్టమని అభిప్రాయపడింది.

జిఎస్టి, డిమోనిటైజేషన్ పాజిటివ్ ఫలితాలు వంటి భారత ఆర్థికరంగంలో చేపట్టిన సంస్కరణలు ప్రజల్లో ఆశాభావాన్ని వెల్లివిరేసేట్టు చేస్తున్నాయని కూడా సర్వే అభిప్రాయపడింది.

కొన్నేళ్ల క్రితం కన్నా ఇప్పుడు ఆయిల్ మార్కెట్ క్లిష్టంగా మారిందని సర్వే అభిప్రాయపడింది.