ఉత్తర కొరియాకు మరో సారి హెచ్చరికలు జారీ చేసిన అమెరికా అధ్యక్షుడు, నిగ్రహం పాటించాలన్న చైనా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న మరోమారు ఉత్తర కొరియాకు హెచ్చరికలు జారీ చేశారు. సమస్య కోసం మిలటరీని పరిష్కారంగా చూడడం అవివేకమైన చర్యగా ఆయన అభివర్ణించారు.

అమెరికా భూభాగంపై దాడి చేసే ఆలోచన చేసినా సరే ఉత్తర కొరియా తగిన పరిణామాలను చవి చూడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

పోంగ్యాంగ్ ప్రకటన నేపథ్యంలో అమెరికా ఈ హెచ్చరిక చేసింది. పసిఫిక్ సముద్రంలోని అమెరికా ద్వీపకల్పం గ్యామ్‌పై దాడి చేసేందుకు తాము మిసైల్స్‌ని సిద్ధం చేస్తున్నామని ఉత్తర కొరియా ప్రకటన చేసింది.

కాగా చైనా మాత్రం ఉత్తర కొరియా విషయంలో నిగ్రహంతో ఉండాలని అమెరికాను కోరింది. ఇరు దేశాలు ఉద్రిక్త పరిస్థితుల నుంచి వెనక్కు తగ్గాలని విజ్ఞప్తి చేసింది.