ఏషియన్ షాట్‌గన్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలుచుకున్న మహేశ్వరీ

షూటర్ మహేశ్వరీ చౌహాన్ ఏసియన్ షాట్‌గన్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలుచుకుంది. ఒక అంతర్జాతీయ పోటీల్లో మహిళా వ్యక్తి విభాగంలో ఇలా మెడల్ సాధించడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం.

ఆస్తానాలో నిన్న జరిగిన పోటీలో మహేశ్వరీ భారత్‌కే చెందిన రష్మీ రాథోడ్, సానియా షేక్‌లతో కలిసి రజత పతకం కోసం పోటీ పడ్డారు.

ఈ త్రయం 190 పాయింట్లు చేరుకోగా చైనా 195 పాయింట్లలో స్వర్ణం, కజకిస్తాన్ 185 పాయింట్లతో కాంస్యలు గెలుపొందాయి.

కాగా ఇప్పటి వరకు జరిగిన పోటీల్లో పతకాల వేటలో భారత్ రెండు స్వర్ణాలు, ఒక రజతం, మూడు కాంస్యాలు గెలుచుకుంది.