కాంస్యం కోసం రంగంలోకి భారత పురుషుల కాంపౌండ్ టీమ్

బెర్లిన్‌లోని ప్రపంచ కప్ 4వ కాంపిటేషన్‌లో నిన్న భారత పురుషుల కాంపౌండ్ టీమ్ కాంస్య పతకం కోసం రంగంలో ఉంది.

కాంస్యం కోసం జరిగే మ్యాచ్‌లో ర్యాంకింగ్‌లో తక్కువ స్థాయిలో ఉన్న జర్మనీతో భారత్ నేడు పోటీ పడబోతోంది.

ఐదవ సీడెడ్ అయినా భారత్ త్రయం అభిషేక్ వర్మ, అమన్ సైని, అమన్‌జీత్ సింగ్‌లు స్పెయిన్‌ను 228-222, అంతకుముందు స్వీడన్‌ను 231-229తో ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది.
ఇక మహిళా విభాగరంలో మూడో సీడెడ్ భారత్ కాంపౌండ్ టీమ్‌కు చెందిన జ్యోతి సురేఖ వెన్నం, త్రిషా దేబ్, స్నేహల్ మంధారేలు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకునేందుకు బై సాధించారు.