కొత్త ఛైర్మన్‌ వెంకయ్య నాయుడుకు ఆహ్వానం పలికిన రాజ్యసభ

రాజ్యసభ తమ నూతన ఛైర్మన్ ఎం.వెంకయ్యనాయుడుకు ఆహ్వానం పలికింది. నిన్న రాజ్యసభలో వెంకయ్య నాయుడు తన బాధ్యతలు స్వీకరించారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను అభినందిస్తూ వెంకయ్య నాయుడు క్షేత్రస్థాయి నుంచి ఎదిగి వచ్చిన నేత అని అభివర్ణించారు.

ఒక రైతు కుటుంబంలో, స్వతంత్ర భారతంలో వెంకయ్యనాయుడు జర్మించారనీ, ఈ స్థాయికి ఎదిగేందుకు ఎంతో శ్రమించారన్నారు. అంతేకాదు ఆయనకు విశేషమైన పార్లమెంటరీ అనుభవం ఉందన్నారు.

అంతేకాదు వెంకయ్యనాయుడు విద్యార్థి నేతగా, జయ ప్రకాశ్ నారాయణ ఆధ్వర్యంలోని అవినీతి వ్యతిరేక పోరాటంలో చురుగ్గా పాల్గొన్న విషయాన్నీ గుర్తుచేశారు.

ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన అనే ఆలోచన కూడా వెంకయ్య బుర్రలో పుట్టిందేనని ప్రధాని మోదీ అన్నారు.

విపక్ష నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ వెంకయ్య రాజ్యసభ ఛైర్మన్‌గా ఎంపిక కావడం దేశ ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి విజయంగా అభివర్ణించారు. విద్యార్థి రాజకీయాల నుంచి అంచెలంచెలుగా ఆయన ఎదిగి వచ్చిన తీరును గులాం నబీ తన ప్రసంగంలో అభినందించారు.