ఖాట్మండులో ముగిసిన బిఐఎంఎస్‌టిఇసి 15వ మంత్రివర్గ సమావేశం

 

బే ఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కో-ఆపరేషన్ (బిఐఎంఎస్‌టిఇసి) 15వ మంత్రివర్గ సమావేశం శుక్రవారం ఖాట్మండులో ముగిసింది.

దేశాలమధ్య సహాయ సహకారాలు పెంపొందించుకోవడం ద్వారా బిఐఎంఎస్‌టిఇసి లక్ష్యాలను సాధించాలని నిశ్చయించుకున్నట్టు ఈ దేశాలు విడుదల చేసిన సమిష్టి ప్రకటనలో పేర్కొన్నాయి.

గోవా రిట్రీట్-2016 సమావేశంలో నాయకులు అంగీకరించిన ‘ఎజెండా ఆఫ్ యాక్షన్’ సాధనపై దృష్టి కేంద్రీకరించనున్నట్టు ప్రకటనలో తెలిపారు.

బే ఆఫ్ బెంగాల్ రీజియన్‌లో వ్యాపారం, పెట్టుబడులు తదితర రంగాల్లో సహాయ సహకారాలు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా ఆ ప్రాంతంలో సమైక్యతను పెంపొందించుకోవాలని కూడా సమావేశం భావించింది. స్వేచ్ఛా వాణిజ్యానికి ఈ మంత్రివర్గ సమావేశం ఎంతో ప్రాధాన్యం ఇచ్చింది.