జూన్ మాసంలో 0.1 శాతం తగ్గిన ఐఐపీ ఔట్‌పుట్

దేశంలో పారిశ్రామిక ఉత్పత్తులు జూన్ మాసంలో 0.1 శాతానికి పడిపోయింది. ముఖ్యంగా మ్యానుఫాక్చరింగ్, కాపిటల్ గూడ్స్ రంగంలో ఈ ఉత్పత్తి తరుగుదల గణనీయంగా కనిపిస్తోంది.

గత ఏడాది జూన్ మాసంలోని ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ (ఐఐపీ) 8 శాతంగా ఉండగా ఈ ఏడాది అదే నెలలో 0.1 శాతం తగ్గింది.

కేంద్ర గణాంకాల కార్యాలయం నిన్న విడుదల చేసిన డేటాలో మ్యానుఫాక్చరింగ్ రంగలో 0.4 శాతం తరుగుదల కనిపించిందని తెలిపింది. కాగా మైనింగ్ రంగంలో 0.4 శాతం వృద్ధి కనిపిస్తందని తెలిపింది.

విద్యుత్ ఉత్పత్తి రంగంలో 2.1 శాతం వృద్ధి కనిపించిందని తెలిపింది. క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తి కూడా 6.8 శాతానికి కుదించుకుపోయిందని పేర్కొంది.