జోర్డన్ సరిహద్దుల్లో సిరియా ఆత్మాహుతి దాడిలో 23 మంది మృతి

జోర్డాన్ సరిహద్దుల్లోని దక్షిణ సిరియాలో జరిగిన ఒక ఆత్మాహుతి దాడిలో 23 మంది ప్రజలు మరణించారు. డజన్ల కొద్ది ప్రజలు గాయాల పాలయ్యారు.

సిరియాలోని మానవ హక్కుల పరిశీలనా సంస్థ దీనికి సబంధించిన వివరాలు తెలిపింది. నిన్న చోటు చేసుకన్న దాడిలో ఒక వ్యక్తి నసీబ్ బార్డర్ వద్ద జైషే అల్ ఇస్లాం బేస్‌లో తనను తాను డిటోనేటర్‌తో పేల్చుకొని ఆత్మాహుతికి పాల్పడ్డట్టు తెలిపింది.

చనిపోయిన వారిలో ఎక్కువ మంది జైష్ అల్ ఇస్లాంకు చెందిన వారే ఉన్నారని సదరు సంస్థ వివరించింది.

గాయపడిన వారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉందని మానవ హక్కుల పరిశీలక సంస్థ అధిపతి రమి అబ్దెల్ రహమాన్ తెలిపారు.