తీవ్రవాదులకు నిధులను అందించడం ద్వారా కశ్మీర్ లోయలో అస్థిరత సృష్టిస్తున్న పాక్

కశ్మీర్ ప్రాంతంలో చట్టవిరుద్ధంగా కొన్ని ప్రాంతాలను పాక్ ఆక్రమించుకోవడమే కాకుండా ఉగ్రవాదులకు నిధులను అందించడం ద్వారా కశ్మీర్‌లో అస్థిర పరిస్థితులను సృష్టిస్తోందని పార్లమెంటరీ ప్యానల్ తన నివేదికలో పేర్కొంది.

విదేశ వ్యవహారాల శాఖకు చెందిన కమిటీ ఈ నివేదికను శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. కశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని తప్పుడు ఆరోపణలకు పాక్ పాల్పడుతున్నట్టు కూడా కమిటి తన నివేదికలో పేర్కొంది.

ఈ కమిటికి డాక్టర్ శశి థరూర్ నాయకత్వం వహించారు. పాక్ తన తీరును మార్చుకోకపోతే భారత్ పివొకెపై తనకున్న హక్కులను నిరూపించుకునే రీతిలో వ్యవహరించాల్సి వస్తుందని  ఆయన వ్యాఖ్యానించారు.