నేడు వివిధ కొత్త సర్వీసులను ప్రారంభించనున్న రైల్వే శాఖ

రైల్వే శాఖ నేడు సరికొత్త సర్వీసులను ప్రారంభించనుంది. దేశంలోని వివిధ మార్గాల్లో వెళ్లే కొత్త రైలు సేవలను ప్రారంభిస్తుంది.

ఉత్తర్‌ప్రదేశ్, ఒడిషా, బిహార్, పంజాబ్, ఢిల్లీ, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, జమ్ము కశ్మీర్ రాష్ట్రాలు ఈ కొత్త సర్వీసుల ద్వారా ప్రయోజనం పొందనున్నాయి.

కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ఫ్రభు ఢిల్లీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేడు కొన్ని, ముంబై నుంచి రేపు మరికొన్ని సర్వీసులు ప్రారంభిస్తారు.