నేడే భారత్, శ్రీలంకల నడుమ చివరి టెస్ట్ మ్యాచ్

భారత్, శ్రీలంక నడుమ జరుగుతున్న మూడు సిరీస్‌ల టెస్ట్ మ్యాచ్‌లో చివరి మ్యాచ్ నేడు ప్రారంభం కానుంది.

శ్రీలంకలోని క్యాండీలో ఈ మ్యాచ్ నేడు ప్రారంభమవుతుంది. కాగా భారత్ ఇప్పటికే రెండు మ్యాచ్‌లను గెలిచి 2-0తో ఆధిపత్యంలో ఉంది.

దాంతో మూడో మ్యాచ్‌ను కూడా భారత్ ఈజీగా నెగ్గుకురాగలదని పరిశీలకులు భావిస్తున్నారు.

ఇంత వరకు జరిగిన మ్యాచ్‌లను భారత్ నాలుగు రోజుల్లోనే ముగించింది. ఇదే ఆనవాయితీ కొనసాగే అవకాశం ఉంది.

కాగా భారత్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాపై ఐసీసీ నిషేధం విధించడంతో ఆయన ఈ మ్యాచ్ ఆడడం లేదు. ఆయన స్థానంలో కుల్‌దీప్ యాదవ్ ఆడే అవకాశం ఉంది.