పతనమవుతున్న స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చవి చూస్తున్నాయి. నిన్న స్టాక్ మార్కెట్ తీరు చేస్తే రికార్డు స్థాయిలో కనిష్టానికి చేరుకున్నాయి.

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ 318 పాయింట్లు అంటే 1.01 శాతం నష్టంతో 31,214 పాయింట్ల వద్ద ముగిసింది. నెల రోజుల్లో స్టాక్స్ ఇంత కనిష్టానికి చేరుకోవడం ఇదే మొదటి సారి.

ఇక నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలోని పరిస్థితి గమనిస్తే అది కూడా 1.11 శాతం కనిష్టంతో ముగిసింది. దీంతో అది 109 పాయింట్లు కోల్పోయి చివరి దశలో 9,711 పాయింట్ల వద్ద ముగిసింది.

గత వారం ఆరు వారాల్లో పరిస్థితిని గమనించినట్లయితే  వారంలో ఇదే అతి పెద్ద భారీ పతనం.