ముగిసిన వర్షాకాల సమావేశాలు- నిరంతరాయంగా వాయిదా పడిన ఉభయ సభలు

వర్షాకాల సమావేశాలు ముగియడంతో ఉభయసభలు వాయిదాపడ్డాయి. ఉభయసభలు నిరంతరాయంగా వాయుదా పడడానికి ముందు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ  ఈ సమావేశాలు 71 గంటలు నడిచినట్టు తెలిపారు.

ఈ సమావేశాల్లో గ్రాంట్స్ (జనరల్)కు సంబంధించి సప్లిమెంటరీ డిమాండ్లను, అదనపు గ్రాంట్ల (జనరల్)కు సంబంధించిన డిమాండ్లను సభ ప్రవేశపెట్టిందన్నారు.

ఈ సమావేశాల్లో 17 బిల్లులను సభలో ప్రవేశపెట్టినట్టు, 14 బిల్లులను సభ ఆమోదించినట్టు చెప్పారామె. ప్రజా సంబంధమైన అంశాలపై అదనంగా పది గంటలు సభ చర్చించినట్టు వెల్లడించారు.

రాజ్యసభ కూడా నిరంతరాయంగా వాయిదాపడింది. రాజ్యసభ కొత్త ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంకయ్యనాయుడు సభ్యులకు ధన్యవాదాలు చెప్పిన అనంతరం సభ నిరంతరాయంగా వాయిదా పడుతున్నట్టు ప్రకటించారు.