సీబీఎఫ్‌సీ ప్రక్షాళన, మూడేళ్ల పాటు కొనసాగనున్న కమిటీ

కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ)లో మార్పు చేర్పులు చేసింది. కొత్త వారిని నియమించింది. వీరు మూడేళ్ల పాటు పదవిలో కొనసాగుతారని ప్రకటించింది.

పాటల రచయిత ప్రసూన్ జోషీ సెన్సార్ బోర్డు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఆయన పహ్లాజ్ నిహలానీ స్థానంలో నియమితులయ్యారు.

కొత్తగా ఏర్పడిన సెన్సార్ బోర్డు తదుపరి ఆదేశాల వరకు మరో మూడేళ్ల పాటు కొనసాగుతుందని తెలిపింది.

కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రిత్వ శాఖ నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో కొత్త బోర్డులో 12 మంది సభ్యులను నియమించినట్లు తెలిపింది.

ఇందులో గౌతమీ తాడిమల్ల, నరేంద్ర కోహ్లి, నరేష్ చంద్ర లాల్, వివేక్ అగ్నిహోత్రి, విద్యాబాలన్ తదితరులు ఉన్నారని వివరించింది.