సెక్యూరిటీ సంరక్షకులకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిన సెబీ

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సెక్యూరిటీ సంరక్షకుల కోసం ఆన్‌లైన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో వారి లావాదేవీలు సులభతరమవుతాయి.

సెబిలో గతంలో వివరాలు నమోదు చేసిన దానికన్నా ఈ పద్ధతిలో వేగంగా రిజిస్ట్రేషన్లు, రెగ్యులేటరీ ఫైలింగ్స్ పూర్తి చేయవచ్చునని సెబీ తెలిపింది.
సెక్యూరిటీ సంరక్షులుగా (కస్టోడియన్లుగా) రిజిస్ట్రేషన్ చేసుకోదలిచిన వారు కూడా ఇకపై ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చని వివరించింది. దీని కోంస సెబి ఇంటర్మీడియరీ పోర్టల్‌ను సంప్రదిస్తే  సరిపోతుంది.