భారీ  స్థాయిలో రుణాలు తీసుకుని తిరిగి చేల్లించని వారి కారణంగా బ్యాంకులు సమర్ధంగా పని చేయలేక పోతున్నాయనీ,  అటువంటి వారి ఆస్తులు స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోనదనీ  కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు.

బ్యాంకుల్లో , భారతీ స్థాయిలో రుణాలు తీసుకొని తిరిగి చెల్లించని వారి నుండి వసూళ్లు రాబట్టడం పెను సవాలుగా మారిందనీ, ఈ కారణంతోనే బ్యాంకులు సమర్ధంగా పని చేయలేక పోతున్నాయనే, కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. . ఆయన నిన్న పూనే లో పూనే జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మాట్లాడుతూ ఇత్వంటి వారిని దివాలా దారులుగా గుర్తించి వారి ఆస్తులు స్వాధీనం చేసుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకున్తోందనీ, తద్వారా రుణాల మొత్తం చెల్లింపుల తర్వాత మిగిలిన మొత్తాన్ని గ్రామీణ రంగ అభివృద్ధికి వినియోగిస్తాయని చెప్పారు.  కార్య్కరమానికి అధ్యక్షత వహించిన NCP అధినేత శరద్ పవార్ బ్యాంక్ సాధించిన విజయాలను ప్రస్తావించారు.