అంకుర పరిశ్రమలకు సదుపాయాల కల్పన నిబంధనలు రూపొదించటంతోపాటు అనేక అంశాలపై చర్చించడానికి వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ, రాష్ట్రాల అంకుర పరిశ్రమల మహాసభ నిర్వహిస్తోంది.

అంకుర పరిశ్రమలకు సదుపాయాలు కల్పించడం నిబంధనలు రూపొందించటంతోపాటు వాటికి సంబంధించి అనేక అంశాలపై చర్చించడానికి కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ రాష్ట్రాల అంకుర పరిశ్రమల మహాసభలు నిర్వహిస్తోంది. అంకుర పరిశ్రమలను ప్రొత్సహించడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇంత వరకు చేపట్టిన చర్యల ఆధారంగా రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు జాతీయ స్థాయి ర్యాంకింగ్ లు ఇవ్వడానికి ఒక ప్రణాళికను రూపొందించడంతోపాటు అనేక అంశాలపైన ఈ మహా సభలు సమావేశాల్లో చర్చిస్తారని మంత్రిత్వ శాఖ నిన్న విడుదల చేసిన ప్రకటనలో వివరించింది.