చెన్నై శివారులోని వానాగారాలో ఈరోజు జరగాల్సిన ఎఐడిఎంకె సర్వసభ్య సమావేశంపైన స్టే విధించడానికి మద్రాస్ హైకోర్టు నిరాకరించింది.

చెన్నై శివారులోని వనాగారాలో ఎఐడిఎంకె సర్వసభ్య సమావేశాలపైన స్టే విధించడానికి మద్రాస్ హైకోర్టు నిరాకరించింది. ముఖ్యమంత్రి ఇ.కె. పళ్లని స్వామి, మాజీ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్ సెల్వం నేతృత్వంలోని రెండు పార్టీ వర్గాలు విలీనం అయిన తర్వాత ఎఐడిఎంకె, కెయిడి మొదటి సర్వసభ్య సమావేశం. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వి.కె. శశికళ భవితవ్యం పైన ఈసమావేశంలో నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. కాగా శశికళ బంధువు, దినకరన్ విధేయుడు వెట్రివేలు ఎఐడిఎంకె సర్వసభ్య సమావేశం ఈరోజు జరక్కుండా స్టే విధించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ పైన జస్టిస్ రాజీవ్ షదర్, జస్టిస్ అబ్దుల్ ఖుదీస్ ల ధర్మాసనం మునుపు ఆపిటిషన్ను కొట్టివేసిన సింగిల్ జడ్జి బెంచ్ ఆదేశాలను సమర్ధించింది.