భారత్ ఆఫ్గనిస్తాన్ దేశాలు ఆరోగ్యం రవాణా అంతరిక్షం కొత్త అభివృద్ధి భాగస్వామ్య రంగాల్లో ఒప్పందాలపై సంతకాలు చేశారు.

భారత ఆఫ్గానిస్తాన్‌ దేశాలు ఆరోజు ఆరోగ్యం, రవాణా, అంతరిక్షం కొత్త నాలుగు అభివృద్ధి సంక్షేమాలపైన సంతకాలు చేశాయి. మనవిదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ ఆఫ్గానిస్తాన్‌ విదేశాంగ మంత్రి సలాహుద్దిన్‌ రబ్బానీ మధ్య న్యూఢిల్లీలో ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం ఈ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ సుష్మాస్వరాజ్‌ భద్రమైన, స్థిరమైన, శాంతియుతమైన, సౌభాగ్యమైన, సమైక్యమైన, సమానమైన జాతిని నిర్మించడంలో ఆఫ్గానిస్తాన్‌ చేస్తున్న కృషిలో భారత్‌ తోడ్పాటు కొనసాగుతుందని చెప్పారు. ఆఫ్గానిస్తాన్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం పెంపొందిస్తామని, ఆఫ్గానిస్తాన్‌ ప్రజల ఆశయాలు, కళలు నెరవేర్చడం భారత్‌ తోడుగా నిలిచి పనిచేస్తుందని ఆమె చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రబానీ ప్రస్తుతం భారతదేశంలో ఆ ప్రాతంలో వున్న దోరణులను బట్టి రెండు దేశాలు సన్నిహితంగా కొనసాగుతున్నాయని సామాజిక, ఆర్థిక, భద్రత, వాణిజ్య ప్రయోజనాలను కాపాడుకుంటామని తెలిపారు.