జపాన్ ప్రధానమంత్రి షింజో ఆబే భారత పర్యటన ఈరోజు ప్రారంభమవుతుంది.. గుజరాత్, అహ్మదాబాద్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ షింజో ఆబేకు స్వాగతం పలుకుతారు. ఈ పర్యటన కాలంలో భారత్ – జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సు జరుగుతుంది.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో.. జపాన్ ప్రధానమంత్రి  షింజో అబే కు స్వాగతం పలుకుతారు. భారత్ – జపాన్ వార్షిక సదస్సుకు హాజరుకావడానికి షింజో అబే రెండు రోజుల పర్యటనకై భారత్ వస్తున్నారు. ఈ 12వ సంచికా సదస్సు రేపు గాంధీనగర్ లో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జపాన్ ప్రధానమంత్రి షింజో అబేల మధ్య ఇది నాల్గవ వార్షిక సమావేశం.!

ప్రత్యేక వ్యూహాత్మక, భౌగోళిక భాగస్వామ్య ప్రణాళిక కింద భవిష్యత్ లక్ష్య కార్యక్రమాన్ని రూపొందిస్తారు. అదే విధంగా రెండు దేశాల మధ్య బహుపాక్షిక సహాకారం ఈ విషయంలో ప్రగతిని సమీక్షిస్తారు. ముంబాయి-అహ్మదాబాద్ ల మధ్య ఏర్పాటు చేయబోయే అతివేగంగా ప్రయాణించే రైలు ప్రాజెక్టు పనులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో నరేంద్రమోదీ, షింజో అబెలు పాల్గొంటారు. హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు ఆరంభమైన రెండు నగరాల మధ్య ప్రయాణ కాలం గణనీయంగా తగ్గుతుంది.

హై స్పీడ్ రైల్ నెట్ వర్క్ నిర్వహించడంలో జపాన్ అగ్రస్థానంలో ఉందియ ప్రపంచంలోనే అతివేగంగా నడిచే రైళ్లలో జపాన్ కు చెందిన షింకన్ సెన్ బుల్లెట్ ఒకటి ఈ రోజు భారత్ – జపాన్ వ్యాపార వేత్తలు ప్లీనరీ సమావేశానికి కూడా నిర్వహిస్తున్నారు. సబర్మతీ నదీ తీరంలో మహత్మాగాంధీ స్థాపించిన సబర్మతి ఆశ్రమాన్ని ఇరుదేశాల ప్రధానమంత్రులు సందర్శిస్తారు. అలాగే అహ్మదాబాద్ లోని సిరి సైయీద్ ని జాలి మసీద్ ను కూడా సందర్శించారు. ఈ మసీద్ 16వ శతాబ్దంలో నిర్మించారు.

మహాత్మాగాంధీ కోసం ఏర్పాటు చేసిన మహాత్మా మందిర్ ను దండి కుటీర్ ను కూడా ఇరువురు నేతలు సందర్శిస్తారు. జపాన్ ప్రధానమంత్రి భారత్ లో పర్యటించనున్న నేపథ్యంలో భారత్ కు జపనాన్ లో గల సంబంధాలనూ చిత్తశుద్ధితో గౌరవిస్తుందని ఇరు దేశాల మధ్య దైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిన్న ట్విట్టర్ లో పేర్కొన్నారు.