పార్లమెంట్ రియన్లు, చట్ట సభ సభ్యులపై ఉన్న క్రిమినల్ కేసులపై విచారణ వేగిరపరిచేందుకు కొత్త ఫాస్ట్ ట్రాక్ న్యాయ స్థానం ఏర్పాటు చట్టం తీసుకువచ్చే అంశాన్ని పరిశీలించాలని కోర్టు ప్రభుత్వాన్ని కోరింది.

హోటళ్లు, రెస్టారెంట్ల ఆదాయం పన్ను రిటర్న్స్ నిర్ధారించేటప్పుడు సర్వీస్ చార్జీలను కూడా ఆదాయంగా పరిగణించాలని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుని కోరింది. ప్రస్తుతం కొన్ని హోటళ్ల వారు 5 నుంచి 20 శాతం మధ్య సర్వీస్ చార్జీ చేస్తున్నాయని, ఈ చార్జీని ఐచ్చికంగా వసూలు చేయాలన్న ప్రభుత్వ మార్గదర్శక సూత్రాలను ఉల్లంఘిస్తున్నాయనీ తెలుస్తోంది. ఇంకా జాతీయ కన్స్యూమర్ హెల్ప్ లైన్ ద్వారా ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయని ఆ శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ట్విట్టర్ లో తెలియచేశారు. ఏప్రిల్ లో ఇందుకు సంబంధించిన మార్గదర్శక సూత్రాలు జారీ చేశారు.