సిరియాలో జరిగే కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్ టోర్మమెంట్ లో పి.వి. సింధు 13 మంది భారత షట్లర్లు పాల్గొంటున్నారు.

సియోమ్ లో కొరియా ఓపెన్స్  సూపర్ సిరీస్ టోర్నమెంట్ లో ఈ రోజు పోటీపడే 14 మంది భారత షట్లర్లలో పి.వి.సింధు ఒకరు. సైనా నెహ్వాల్ ఈ పోటీల్లో పాల్గొనక పోవడం వల్ల మహిళల సింగిల్స్ లో 5వ సీసెడ్ గా సింధు ఒక్కరే పాల్గొంటున్నారు. హాకాంగ్ క్రీడాకారిణి నాగాన్ గి చివాంగ్ తో ఆమె ప్రారంభ మ్యాచ్ ఆడతారు. రియో ఓలంపిక్స్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ రజత పతక విజేత అయిన పి.వి.సింధు చివాంగ్ తో గతంలో ఆడిన నాలుగు మ్యాచుల్లో  ఎప్పుడూ ఓడి పోలేదు. పురుషుల సింగిల్స్ మొదటి రౌండ్ లో బి. సాయి ప్రణీత్, హెచ్.ఎస్.ప్రణయ్, పారుపల్లి కశ్యప్, సౌరభ్ వర్మ, సమీర్ వర్మలు ఆడతారు. ఈ టోర్మమెంట్ లో కిడాంబి శ్రీకాంత్ పాల్గోవడం లేదు. భారత షట్లర్లు మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో కూడా పోటీ పడతారు.