జమ్ము కశ్మీర్ లో పూంజ్ జిల్లాలో నియంత్రణ రేఖ దగ్గర కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లఘించి పాకిస్తాన్ బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు బిఎస్ ఎప్ జవాన్లతోపాటు ఐదుగురు గాయపడ్డారు.

జమ్ము కశ్మీర్ లో పూంజ్ జిల్లాలో నియంత్రణ రేఖ దగ్గర కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించి.. పాకిస్తాన్ బలగాలు జరిపిన బలగాల్లో ఇద్దురు బిఎస్ఎఫ్ జవాన్లతోపాటు ఐదుగురు గాయపడ్డారు.

జమ్ము జిల్లా ఆకునూర్ ప్రాంతంలో ప్రగ్వాల్ సెక్టార్ లో నిన్న  మధ్యాహ్నం 3 గంటల 15 నిముషాలకు పాకిస్తాన్ రేంజర్లు మురబెల్లా, రాయిపూర్ సరిహద్దుల్లో కాల్పులు జరిపాయని రక్షణ వర్గాలుతెలిపాయి. అంతకు ముందు మరో సంఘటన లో పూంజ్ జిల్లా మాన్ కోట్, సబ్జియా, తిక్వార్ ప్రాంతాల్లో 3 గంటల వేళ పాకిస్తాన్ సైన్యం కాల్పులకు పాల్పడింది. భారత బలగాలు ధీటుగా సమాధానమిచ్చాయి. గడిచిన  ఐదు రోజుల్లో పాకిస్తాన్ కాల్పులకు పాల్పడ్డం ఇది నాలుగోసారి.