ప్రధానమంత్రి నరేంద్రమోదీ జపాన్ ప్రధానమంత్రి షింజో అబే సంయుక్తంగా ఈరోజు అహ్మదాబాద్ – ముంబాయి మధ్య నడిచే హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేస్తారు. ఇరువురు నేతలు గాంధీ నగర్ లో భారత్ – జపాన్ 12వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పలు అంశాలపై చర్చిస్తారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, జపాన్ ప్రధానమంత్రి షింజో అబే సంయుక్తంగా ఈరోజు ముంబై-అహ్మదాబాద్ మధ్య నడిచే హైస్పీడ్ రైలు ప్రాజెక్టు శంఖుస్థాపన చేస్తున్నారు. ఆ రైలు 500 కిలోమీటర్ల దూరాన్ని రెండు గంటల్లో చేరుకుటుంది. ఆ ప్రాజెక్టు 2027 కల్లా పూర్తివుతుందని భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంకల్పించిన ఆప్రాజెక్టు జపాన్ అప్పు ఇస్తుంది.

ఆ తర్వాత గాంధీనగర్ లో జరుగుతున్న భారత్  జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో ఇరువురు నేతలు పలు అంశాలపైన చర్చిస్తారు. ఈ సందర్భంగా కొన్ని ఒప్పందాలపైన సంతకాలు జరిగే అవకాశముంది.

జపాన్ ప్రధానమంత్రి షింజో అబే, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిన్న ఆహ్మదాబాద్ లో జరిగిన సాంస్కృతిక రోడ్ షో లో పాల్గొన్నారు. ఎనిమిది కిలోమీటర్ల మేర అహ్మదాబాద్ విమానశ్రయం నుంచి సబర్మతి ఆశ్రమం వరకు ఆ రోడ్ షో నిర్వహించారు. భారత్ లో రెండు రోజుల పర్యటన కోసం షింజో అబే నిన్న అహ్మదాబాద్ చేరుకున్నారు. మన దేశానికి విచ్చేయిన విదేశీ ప్రధానమంత్రి, మన దేశ ప్రధానమంత్రి తో కలిసి రోడ్ షోలో పాల్గొనటం అదే మొదటిసారని అధికార వర్గాలు తెలియజేశాయి.