మయన్మార్ రో రఖ్రైన్ రాష్ట్రంలో భద్రతా బలగాల చర్యల సదంర్భందా పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగినట్లు వచ్చిన పార్తలపైన ఐక్యరాజసమితి భద్రతా మండలి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

మయన్మార్ లో రఖైన్ రాష్ట్రంలో  నిన్న మరోసారి పెద్దఎత్తున హింసాకాండ చెలరేగిందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హింసాకాండ కారణంగా రఖైన్ రాష్ట్రం నుంచి మూడు లక్షల 80 వేల మంది రోహింగ్య ముస్లీంలు బలవంతంగా బంగ్లాదేశ్ కు పారిపోవాల్సి వచ్చింది. రఖైన్ లో హింస ఆపడానికి చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. మయన్మార్ పైన ఒర ప్రకటనకు భద్రతా మండలి ఆమోదం తెలపడం 9 ఏళ్లలో నిన్న తొలిసారని సమితిలో బ్రిటన్ రాయబారి మాత్యూ రైకోట్స్ అన్నారు. ఇలా ఉండగా రోహింగ్యలపైన సైనిక చర్య వెంటనే ఆపాలని సమితి ఉన్నత కార్యదర్శి మయన్మార్ కు పిలుపునిచ్చారు. మయన్మార్ లో జరుగుతున్న హింసాకాండ పై ఐక్యరాజ్య సమితి ఒక ప్రత్యేక సమావేశాన్నినిర్వహించింది. బ్రిడన్, స్వీడన్ దేశాల కోరిక మేరకు ఆసమావేశం జరిగింది. రోహింగ్య జరుగుతున్న హింసాకాండపై ప్రపంచ దేశాల విమర్శల నేపథ్యంలో మయన్మార్ నాయకురాలు హంసాన్ సుకీ ఐక్యరాజ్యసమితి, సర్వప్రతినిధి సభకు హాజరవ్వాలన్నతమ యోచన విరమించుకున్నారు. కిందటి నెల 25 వ తేదీన పోలీస్ పోస్టులపై రోహింగ్య ములిటెంట్లు దాడి చేసిన తర్వాత రఖైన్ రాష్ట్రంలో రోహింగ్య లపై హింసాకాండ మొదలైంది. సైనిక చర్య నేపథ్యంలో 3 లక్షల 70 వేల మంది రోహింగ్య ముస్లీంలు ఆత్మరక్షణ కోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇళ్లు, ఊళ్ళు ఒదిలిపెట్టి వెళ్లారు.  మయన్మార్ ప్రభుత్వం జాతి విధ్వంసానికి, నరమేధానికి పాల్పడుతుందని ఐక్యరాజ్యసమితి  నిదించింది. ఇలా ఉండగా మయన్మార్ సైన్యం తాము రోహింగ్య మిలిటెంట్లపైన పోరాతున్నాంతప్ప..  పౌరులపై దాడులు చేస్తుంన్నామనటం ఎంతమాత్రం సరికాదని ఖండించింది.

బంగ్లాదేశ్, మయన్మార్ రోహింగ్యల తక్షణ అవసరాల కోసం అదనంగా 3 మిలియన్ యూరోల సహాయాన్ని యూరప్ సమాఖ్య ప్రకటించింది. మే నెలలో  రఖైన్ రాష్ట్రంలో పర్యటించినపుడు ప్రకటించిన 12 మిలియన్ యూరోలకు ఇది అధనమని యూరప్ సమాఖ్య మానవతా సహాయం కమిషన్ క్రిస్తోస్తు స్టాలియెస్ ఇంటెలిజెస్యా. పెద్ద ఎత్తులో శరణార్థుల బంగ్లాదేశ్ కు చేరుకోవాడంతో వారికి ఆశ్రయం కల్పించడానికి మంచినీళ్ళు, ఆహారం, ఔషధాలు అందించడానికి అధనపు నిధులను ఉపయోగిస్తారని తెలిపారు. అంతర్జాతీయ స్వచ్ఛంధ సంస్థలు , ఐక్యరాజ్య సమితి రెడ్ క్రాస్ ద్వారా నిధులు ఖర్చు చేస్తారు. మయన్మార్ లో రోహింగ్యాలకు పూర్తి స్థాయిలో మానవతా సహాయానికి  మరోసారి పిలుపునిస్తూ యూరప్ సమాఖ్య ఇప్పటికే ఆందోళన కారణంగా ఉన్న పరిస్థితి ఒక సంక్షోభంగా పరిణమించకముందే అందరిపై ఉందని పేర్కొంది. యూరప్ సమాఖ్య ఉప అధ్యక్షులు ఫెడిరికా మోగిరీనీ విడిగా ఒక ప్రకటన చేస్తూ పూర్తి స్థాయి మానవతా సహాయంతో పాటు కోఫియానన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయడం ద్వారా ఘర్షణకు మూలమైనటు వంటి సమస్యలను పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.