యుఎన్‌సిహెచ్ఆర్‌ వ్యాఖ్యలను బలంగా ఖండించిన భారత్

 

రచన : యోగేష్ సూద్, జర్నలిస్టు
మయన్మార్‌లోని రోహింగ్యాల సమస్యపై ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ (యుఎన్‌సీహెచ్ఆర్) జైద్ రాఅద్ అల్ హుస్సేన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మయన్మార్ పాఠ్యాంశ తరహా పద్ధతిలో పురాతన జాతుల ప్రక్షాళన చేయాలని చూస్తోందని అనడంతోపాటు భారత్‌లోకి పారిపోయి వచ్చిన రోహింగ్యాలను తిరిగి వెనక్కు పంపించే ప్రయత్నాలను తప్పుబట్టారు. ఈ విమర్శకు భారత్ ఘాటుగానే స్పందించింది.

మిలియన్ జనాభా ఉన్న రోహింగ్యాలు తరతరాలుగా మయన్మార్‌లో నివసిస్తున్నా వారిని ఒక ప్రాంతవాసులుగా గుర్తించకపోవడం 1982ల నాటి నుంచి వస్తోంది. దాంతో వారు నిత్యం పీడనకు గురువుతూ వస్తున్నారు. మయన్మార్ ప్రధానంగా బుద్ధిస్టు దేశం. తమని తాము బెంగాలీ గ్రూపులుగా అభివర్ణించుకుంటారు. బంగ్లాదేశ్‌తో కూడా వారు అనుసంధానం చేసుకుంటారు. ప్రపంచంలో తమకంటూ ఒక ప్రాంతం లేని అతి పెద్ద పురాతన జాతుల్లో రోహింగ్యాలు ఒకరు. మయన్మార్ ప్రభుత్వం వారిని తమ దేశ పౌరులుగా గుర్తించడం లేదు. దాంతో వారు చట్టబద్ధమైన పీడనను, వేధింపులను ఎదుర్కొంటున్నారు. ఆ దేశంలో వారిపై అనేక ఆంక్షలు ఉన్నాయి. చివరకు వారు స్వేచ్ఛగా సంచరించే వీలు కూడా లేదు. ఆర్ధిక, విద్య, వైద్య సౌకర్యాలతోపాటు ఇతర హక్కులు కూడా వారికి నిరాకరించబడ్డాయి. ఫలితంగా వారు పేదరికంలో మగ్గుతూ దీనమైన జీవితాన్ని గడుపుతున్నారు.

ఇటీవలి కాలంలో దాదాపు 400 మంది రోహింగ్యాలను మయన్మార్‌లోని తూర్పు తీరంతోపాటు, బంగ్లాదేశ్ దక్షిణ సరిహద్దుల్లో కాల్చి చంపినట్లు సమచారం. రోహింగ్యా మిలిటెంట్ గ్రూప్‌పై మయన్మార్ జరిపిన సైనిక చర్యలు వీరు మృత్యువాత పడ్డారు. రోహింగ్యాలలోని ఉగ్రవాదులపై మాత్రమే తాము చర్యలు తీసుకుంటున్నామని మయన్మార్ సైన్యం చెబుతోంది. ఈ పరిస్థితుల్లో కేవలం గత వారంలో దాదాపు 30,000 మంది రోహింగ్యాలు మయన్మార్‌ను విడిచిపెట్టి బంగ్లాదేశ్‌కు పారిపోయారు. ఇప్పటికే అక్కడ సుమారు 4,00,000 మంది రోహింగ్యాలు శరనార్ధులుగా ఆశ్రయం పొందుతున్నారని ఢాకా అధికార వర్గాలు చెబుతున్నాయి. భారత దేశంలో సుమారుగా 40,000 మంది రోహింగ్యా శరణార్ధులు ఉన్నట్లు అంచనా. ఇందులో 16,000 మంది ప్రభుత్వం నుంచి శరణార్ధులుగా గుర్తింపు పత్రాలు కూడా అందుకున్నారు. పెరుగుతున్న తిరుగుబాటు వల్ల రాఖైన్‌లోని పశ్చిమ ప్రాంతాల్లో ఈ మైనారిటీ జాతి మీద మరింత హింస కొనసాగుతుందని ఐక్యరాజ్య సమితి అభిప్రాయపడుతోంది.

శరణార్ధుల విషయంలో ఐక్యరాజ్య సమితి హైకమిషనర్ చేసిన వ్యాఖ్యలతో భారత్ కలవరపాటుకు గురైంది. ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్య దేశంగా ఉన్న భారత్ ఈ వ్యాఖ్యలపై ఘాటుగానే స్పందించింది. ఆధార రహిత, ఎంపిక చేసిన నివేదికలపై ఆధారపడి ఉద్దేశపూర్వక తీర్పులు ఇవ్వడం సరికాదనీ, దీని వల్ల సమాజంలో మానక హక్కుల పరిస్థితి మెరుగుపడదని స్పష్టం చేసింది.

దీనికి కారణం రక్షణపరమైన సమస్యలు తలెత్తుతాయనే ఉద్దేశంతో భారత దేశం చట్ట విరుద్ధమైన వలసల పట్ల తొలి నుంచీ ఆందోళనతో ఉంది. ఈ క్రమంలో న్యాయబద్ధం, చట్టాలను అమలు పరచడం కారుణ్యం లోపించడంగా భావించడం సరైంది కాదని అభిప్రాయపడుతోంది.

భారత దేశంలో గతంలోనే రాఖైన్ ప్రాంతంలోని పరిస్థితులు, రోహింగ్యా శరణార్ధుల తాకిడిపై తన ఆందోళనను వ్యక్తం చేసింది. నెపిడో రాఖైన్‌లోని పౌర సమాజం సంక్షోమం కోసం కృషి చేయాలని న్యూఢిల్లీ పిలుపును కూడా ఇచ్చింది. దీనికి ప్రతిగా మయన్మార్ రక్షణ దళాలు సమస్య సమసి పోయిందనీ, హింసాత్మక ఘటనలు తగ్గిపోయాయనీ, సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని తెలిపింది.

మయన్మార్‌లోని రాఖైన్ రాష్ట్రంలో హింసను నివారించాల్సిన అవసరం ఉంది. దీని కోసం ఆ దేశం రోహింగ్యా శరణార్ధుల సంక్షోభాన్ని పరిష్కరించేందుకు నిగ్రహాన్ని, పరిణితిని ప్రదర్శించాల్సి ఉంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదుల చేసిన ఒక ప్రకటనలో భారత్ మయన్మార్‌లోని రాఖైన్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నట్లు స్పష్టం చేసింది. అంతేకాదు ఆ దేశం నుంచి కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్న శరణార్ధుల విషయంలోనూ తాము ఆందోళనలో ఉన్నామని స్పష్టం చేసింది. రాఖైన్ రాష్ట్రంలో మయన్మార్ రక్షణ దళాలపై జరిగిన ఉగ్రవాద దాడులను న్యూఢిల్లీ గతంలోనే తీవ్రంగా ఖండించింది.

కాగా, ఇరు దేశాలు ఉగ్రవాదంపై పోరు విషయంలో కట్టుబడి ఉండాలనే దృఢ సంకల్పాన్ని వ్యక్తం చేశాయి. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులకు అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల తన మయన్మార్ పర్యటనలో భాగంగా హింసాత్మక ఘటనల్లో మృతి చెందిన రక్షణ దళాలు, ఇతర అమాయక ప్రజల మరణం పట్ల తీవ్ర సంతాపం ప్రకటించారు. శాంతి, మత సామరస్యం, సమ న్యాయం, గౌరవం, ప్రజాస్వామ్య విలువల విషయంలో ఒక పరిష్కారం కనుగొనాలని కూడా ఆయన ఈ సందర్భంగా సూచించారు.  రాఖైన్ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మయన్మార్ ప్రభుత్వానికి సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా ప్రధాని మోదీ తన పర్యటనలో ఆ దేశానికి స్పష్టం చేశారు.

భారత దేశ సముద్ర జలాల దౌత్యంతోపాటు ‘లుక్ ఈస్ట్ పాలసీ’లో లబ్ధిదారు అయిన మయన్మార్ కీలకమైన దేశం. అంతేకాదు ఇరు దేశాలు ఉగ్రవాదంపై పోరు విషయంలో కట్టుబడి ఉండాలనే దృఢ సంకల్పంతో ఉన్నాయి. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులకు అవకాశం ఇవ్వకూడదని కూడా నిర్ణయించాయి. రాఖైన్ రాష్ట్రంలోని సామాజిక ఆర్ధిక అభివృద్ధి కోసం అక్కడ మౌలిక వసతులు, సామాజిక-ఆర్ధిక ప్రాజెక్టుల్లో పాలుపంచుకునేందుకు భారత్ ముందుకు వస్తుంది.

కాగా, భారత్ 1951లోని ఐక్యరాజ్య సమితి శరణార్ధ కన్వెన్షన్‌లోగానీ, 1967 నాటి శరణార్ధుల స్థితిగతుల ప్రొటోకాల్‌ పైన గానీ సంతకం చేయాలేదు. దీంతో శరణార్ధులకు ఆశ్రయం ఇవ్వాలనే ఎలాంటి బాధ్యత దానిపై లేదు. అయినా భారత దేశం మానవ హక్కుల విషయంలో ఎలాంటి తప్పులకు ఆస్కారం ఇవ్వకుండా జాగ్రత్త పడుతోంది. భారత దేశంలో గతంలో తూర్పు, పశ్చిమ పాకిస్తాన్‌లు, మయన్మార్, శ్రీలంక, టిబెట్, ఆప్ఘనిస్తాన్ నుంచి వచ్చిన శరణార్ధులకు ఆశ్రయం ఇచ్చింది. అయితే రోహింగ్యాలపై నానాటికీ పెరుగుతున్న దోపిడి నేపథ్యంలో ఈ విషయంలో అంతర్జాతీయ ప్రతిస్పందన అవసరం. కాగా భారత్‌లోని శరణార్థ శిబిరాలు ఇప్పటికే వారితో పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. మయన్మార్ ప్రభుత్వం సుదీర్ఘ కాలంగా ఇబ్బందిపెడుతున్న ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కారించుకుంటుందని ఆశిద్దాం.