2024, 2028 ఓలంపిక్స్ పారిస్ లో, లాస్ ఎంజిల్స్ లో అంతర్జాతీయ ఓలంపిక్స్ సంఘం ప్రకటించింది.

2024, 2028 ఓలంపిక్స్ పారిస్, లాస్ ఏంజిల్స్ లో జరుగుతాయని అంతర్జాతీయ ఓలంపిక్స్ సంఘం ప్రకటించింది. ఆరెండు నగరాలు 2024లో నర్వహిస్తామంటూ పోటీపడ్డాయి. అయితే ఒలంపిక్స్ సంఘం నిధులకు హామీ ఇచ్చిన తర్వార మరో నాలుగేళ్లపాటు ఆగడానికి లాస్ ఏంజిల్స్ ఆగడానికి అంగీకరించింది. ఆ రెండు నగరాల్లో ఒలంపిక్స్ నిర్వహించడానికి ఏకగ్రీవంగా ఆమోదం లభించిందిని అంతర్జాతీయ ఓలంపిక్స్ సంఘం ఐఓసి అధ్యక్షులు థామస్ బ్యాచ్ తెలియజేశారు. ఓలంపిక్స్ కోసం పారిస్ 2008, 2012లో కూడా పోటీ పడింది. గతంలో 100ఏళ్ల క్రితం పారిస్ లో ఓలంపిక్స్ జరిగాయి. లాస్ ఏంజిల్స్ 1932లో, 1984లో ఓలంపిక్స్ నిర్వహించారు. హ్యాంబర్గ్, రోమ్, బుడాపిస్ట్ పోటీ నుంచి వైదొలగిన తర్వాత 2024 ఓలంపిక్స్ కు పారిస్, లాస్ ఏంజిల్స్ రెండే పోటీలో నేగ్గాయి. చివరకు 2024లో పారిస్ లో, 2028లో లాస్ ఏంజిల్స్ ఓలంపిక్స్ నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారు.