మెట్రో రైలు చార్జీల నిర్ణయక కమిటీ చేసిన సిఫార్సుల మేరకు ఢిల్లీ మెట్రో రైలు ఈరోజు నుంచి మెట్రో రైలు చార్జీలు పెంచింది.

మెట్రో రైలు చార్జీల నిర్ణయక కమిటీ చేసిన సిఫార్సులననుసరించి ఢిల్లీ మెట్రో రైలు ఈరోజు నుంచి మెట్రో రైలు చార్జీలు  పెంచింది. ఢిల్లీ మెట్రో సంస్థ డిఎంఆర్ సి పాలక మండలి గత రాత్రి నిర్వహించిన పాలక మండలి కమిటీ చేసిన సిఫార్సుల చార్జీల పెంపు ఈరోజు నుంచి అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. పెరిగిన ధరల ప్రకారం ఢిల్లీ మెట్రో రైలు చార్జీలు 2 కిలోమీటర్ల వరకు 10 రూపాయలుగా నిర్ణయించారు. 2 నుంచి  5 కిలోమీటర్ల వరకు 20 రూపాయలని, 5 నుంచి 12  కిలోమీటర్ల వరకు 30 రూపాయలని నిర్ణయించారు. అలాగే ఢిల్లీ మెట్రో రైలు చార్జీలు 21 కిలోమీటర్ల వరకు 41 రూపాయలుగా, 21  కిలోమీటర్ల నుంచి 32 కిలోమీటర్ల  50 రూపాయలుగా, 32 కిలోమీటర్ల మించిన దూరానికి 60 రూపాయలుగా నిర్ణయించారు. అయితే… విమానశ్రయ మార్గంలో ఆరేంజ్ లైన్ లో నడిచే ఢిల్లీ మెట్రో రైలు సేవల చార్జీలు మార్చలేదు.