కార్తీ చిదంబరానికి సంబంధించి విదేశీ బ్యాంక్‌ ఖాతాలు, ఆస్తుల విషయంలో సి.బి.ఐ. సమర్పించిన సంబంధిత పత్రాలను సుప్రీంకోర్టు ఈరోజు పరిశీలిస్తుంది.

కార్తీ చిదంబర్‌కు సంబంధించి విదేశీ బ్యాంక్‌ఖాతాలు, ఆస్తులపై సి.బి.ఐ. సమర్పించిన పత్రాలను సుప్రీంకోర్టు ఈరోజు పరిశీలిస్తుంది. కార్తీ విదేశీ బ్యాంక్‌ ఖాతాలు, ఆస్తులు సహా పలు పత్రాలను సమర్పించినట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీప్‌ మిశ్రాతో కూడిన ధర్మాసనానికి సి.బి.ఐ. తెలిపింది. మద్రాసు హైకోర్టు విదించిన స్టే ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సి.బి.ఐ. దాఖలు చేసిన అప్పీల్‌ను అత్యున్నత న్యాయస్థానం పరిశీలిస్తుంది. కాగా సిబిఐ వివరాలను కార్తీ తరఫున న్యాయవాది త్రోసిపుచ్చింది. అవి కేసు డైరీకి సంబంధం లేని అంశాలని అన్నారు