నూతనంగా ఏర్పడిన ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సమావేశం ఈరోజు కొత్తఢిల్లీలో నీతిఆయోగ్‌లో తొలిసమావేశం నిర్వహిస్తుంది.

కొత్తగా ఏర్పడిన ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఈరోజు – ఢిల్లీలో నీతిఆయోగ్‌ తొలిసారి సమవేశమవుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణతను నివారించేందుకు ప్రముఖ ఆర్థిక వేత్తలు, నిపుణులతో అయిదుగురు సభ్యుల కమిటీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ గత 26వ తేదీన నియమించారు. నీతిఆయోగ్‌ ఉపాధ్యాక్షుడు బివేక్‌ దేబ్రరు నాయకత్వాన గల ఈ మండలిలో ఆర్థిక కార్యదర్శి రతన్‌ పి.వాటల్‌ మెంబర్‌ కార్యదర్శిగా, సుర్జిత్‌భల్లా, రతిన్‌రాష్‌, అషియోగోయల్‌ పార్ట్‌ టైమ్‌ సభ్యులుగా ఉన్నారు. ఈ మండలి కీలకమైన అంశాలను, ఆర్థిక విషయాలను విక్షించి ప్రధానమంత్రికి వివరిస్తుంది. స్థూల ఆర్థికరంగ అంశాలను కూడా ఇది పరిశీలిస్తుంది. వాటిపై తన అలోచనలను నివేదిస్తుంది. కాగా జి.డి.పి. వృద్ధి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలోని అంశాలు ఈరోజు సమావేశంలో చర్చిస్తారని భావిస్తున్నారు. జూన్‌ త్రైమాసికం నుంచి డిజిపి మందగించింది.