ఆగస్టా వెస్ట్‌లాండ్‌ వి.వి.ఐ.పి. హెలికాప్టర్ల కొనుగోలు వ్యవహారం కేసులోసి.బి.ఐ. ప్రత్యేక కోర్టు ముగ్గురు యూరోపియన్‌ మధ్యవర్థులకు బెయిల్‌కువీల్లేని వారెంట్లు జారిచేసింది.

రాష్ట్రాల గవర్నర్ల రెండురోజులసమావేశాలు ఢిల్లీలో ఈరోజు రాష్ట్రపతి భవన్‌లో ప్రారంభమవుతాయి. రాష్ట్రపతిరామ్‌నాథ్‌కోవింద్‌ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. నూతన భారతదేశం-2022 అనేది ప్రారంభ సమాచారానికి ఇతివృత్తంగా వుంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశాల్లో ప్రసంగిస్తారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఇరవై ఏడుగురు గవర్నర్‌లు ముగ్గురు లెఫ్టినెంట్‌గవర్నర్లు సమావేశాల్లో పాల్గొంటారు. కేంద్రమంత్రులు నీతిఆయోగ్‌ఉపాధ్యక్షులు, ముఖ్య కార్యనిర్వహనాధికారి ఇతర ఉన్నతాధికారులు సమావేశాల్లోపాల్గొంటారు.