న్యూఢిల్లీలో ఈరోజు మొదలవుతున్న రెండు రోజుల గవర్నర్ల సమావేశాలకు రాష్ట్రపతి రాంనాథ్‌కోవింద్‌ అధ్యక్షత వహిస్తారు.

వ్యక్తిగతగోప్యతపైన ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు సరైన మినహాయింపులతో ఆధార్‌నుపరిరక్షించిందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు. ఇటీవలి తీర్పు తర్వాతఆధార్‌ విషయంలో ప్రభుత్వ వైఖరిపైన కొలంబియా విశ్వవిద్యాలయంలో ఒక ప్రశ్నకుసమాధానం చెబుతూ మంత్రి సమాచార సంరక్షణ గురించి ఉల్లంగనల పర్యవసానం గురించిఆధార్‌ చట్టంలో ఒక అధ్యాయముందని తెలియజేశారు. భద్రత నిబంధనలను చట్టబద్దంచేసినట్టు చెప్పారు.