విశ్వవిద్యాలయాలు, సాంకేతిక సంస్థలు, ఎయిడెడ్‌ కళాశాలల అధ్యాపకులకు ఇతరసిబ్బందికి ఏడవ వేతన సంఘం ప్రయోజనాలను కేంద్రమంత్రి మండలి ఆమోదించింది.నైపుణ్యాల అభివృద్ధికి రెండు నూతన పథకాలను కూడా ఆమోదించింది.

కేంద్ర, రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, సాంకేతిక సంస్థలు, ఎయిడెడ్‌ కళాశాలలఅధ్యాపకులకు, ఇతర సిబ్బందికి ఏడవ వేతన సంఘం ప్రయోజనాలను కేంద్రమంత్రి మండలిఆమోదించింది. 2016 జనవరి 1 నుంచి వర్తింపజేస్తారు. దీనివల్ల వార్షికకేంద్ర ఆర్థిక భారం 9 వేల 8 వందల కోట్ల రూపాయలుంటుంది. ఈ నిర్ణయం వల్లఏడున్నర లక్షల మంది అధ్యాపకులకు ప్రయోజనం కలుగుతాయని తెలిపారు.న్యూఢిల్లీలో నిన్న సమావేశం తర్వాత మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిప్రకాశ్‌ జవదేకర్‌ మీడియాతో మాట్లాడుతూ కొత్త పే స్కేళ్ళ ప్రకారం అధ్యాపకులజీతాలు పది నుంచి 50 వేల రూపాయల వరకు పెరుగుతాయని చెప్పారు. ఐ.ఐ.టి.లు, ఐఐఎంలు, ట్రిపుల్‌ ఐ.టి.లు, కేంద్రం నిధులిస్తున్న ఇతర సంస్థల అధ్యాపకులకుప్రయోజనం కలుగుతుందని చెప్పారు.