వ్యక్తిగత గోప్యతపైన ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పు సరైన మినహాయింపులతోఆధార్‌ను పరిరక్షించిందని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చెప్పారు.

నైపుణ్యాలఅభివృద్ధికి కేంద్రమంత్రి మండలి రెండు పథకాలను ఆమోదించింది. ఈ పథకాలనుజివనోపాధి ప్రోత్సాహానికి నైపుణ్యాలు, విజ్ఞాన అవగాహన ‘సంకల్ప్‌’ అని, పారిశ్రామిక విలువ పెంచడాని నైపుణ్యాల పటిష్టత స్ట్రయివ్‌ అని పేర్లుపెట్టారు. సంకల్ప్‌కు 4445 కోట్ల రూపాయలు, స్ట్రయివ్‌కు 2,200 కోట్లరూపాయలు నిధులు కూడా ఇస్తారు. నైపుణ్యాభివృద్ధి మంత్రి ధర్మేంధ్రప్రధాన్‌ ఈవివరాల వెల్లడిస్తూ దేశ విదేశీ అవసరాల ప్రకారం శ్రామిక శక్తిని దీటుగాతీర్చిదిద్దడం పథకాల లక్ష్యమని చెప్పారు.