ఈ వేళ ప్ర‌జా ప్ర‌సార‌ దినోత్స‌వం జ‌రుపుకుంటున్నారు.

ఈ రోజును ప్ర‌జా ప్ర‌సార దినోత్స‌వంగా పాటిస్తున్నారు. జాతిపిత మ‌హాత్మ‌గాంధీ 1947వ సంవ‌త్సంలో మొద‌టిసారి, ఆఖ‌రిసారిగా ఢిల్లీ  ఆకాశ‌వాణి స్టూడియోను సంద‌ర్శించ‌డాన్ని పుర‌స్క‌రించుకుని ఏటా న‌వంబ‌ర్ 12వ తేదీన  ప్ర‌సార దినంగా పాటిస్తున్నారు. దేశ విభ‌జ‌న త‌ర్వాత హ‌ర్యానాలోని కురుక్షేత్రలో తాత్కాలికంగా ఆవాసం ఏర్ప‌ర్చుకున్న నిర్వాసితుల‌ను ఉద్దేశించి గాంధీ ప్ర‌సంగించారు. ప్ర‌సార దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఢిల్లీ ఆకాశ‌వాణి కేంద్రంలో ఒక కార్య‌క్ర‌మం ఏర్పాట‌వుతోంది.