జ‌మ్ముక‌శ్మీర్‌లోని వాస్త‌వాధీన రేఖ‌, అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి పౌర‌ప‌రిపాల‌న‌, ఆర్మీ, పారామిల‌ట‌రీల నుంచి కేంద్రం స‌ల‌హాలు కోరింది.

జ‌మ్ముక‌శ్మీర్‌లోని వాస్త‌వాధీన రేఖ‌, అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు ప్రాంతాల్లోని ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న‌ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై ప్ర‌భుత్వం పౌర‌ప‌రిపాల‌న‌,సైన్యం, పారామిల‌ట‌రీల నుంచి కేంద్రం స‌ల‌హాలు కోరుతోంది. ఈ అంశంపై నిన్న జ‌మ్ములో జ‌రిగిన ఉన్న‌త‌స్థాయి స‌మావేశం ఈ మేర‌కు నిర్ణ‌యించింద‌ని అంత‌ర్గ‌త మంత్రిత్వ‌శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి అధికార ప్ర‌తినిధి దీనామిత్ర తెలిపారు. ఆయా స‌రిహ‌ద్దు ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌కు స‌హాయం అందించేందుకు పౌర‌పాల‌న‌, ఆర్మీ, బీఎస్ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌కు చెందిన అధికారులు స‌ల‌హాల‌ను కోరింద‌ని తెలిపారు. సరిహ‌ద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ త‌ర‌చూ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు , కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డుతున్న నేప‌థ్యంలో మిత్ర నాయ‌క‌త్వంలోని ఉన్న‌త‌స్థాయి బృందం అక్క‌డ ప‌ర్య‌టించింది. ఆ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జ‌మ్ము, సాంబ‌, క‌త్వా, ర‌జౌరీ ప్లంచ్ ప్రాంతాల్లోని ప్ర‌జ‌ల‌తో ఆమె స‌మ‌గ్రంగా చ‌ర్చించారు.