ఇరాన్-ఇరాక్ ఉత్తర సరిహద్దుల్లో సంభవించిన భూకంపంలో సుమారు 170 మంది ప్రాణాలు కోల్పొయారు. వెయ్యింమందికి పైగా గాయపడ్డారు.

ఇరాన్-ఇరాక్ ఉత్తర సరిహద్దుల్లో సంభవించిన భూకంపంలో సుమారు 170 మంది ప్రాణాలు కోల్పొయారు. వెయ్యింమందికి పైగా గాయపడ్డారు. సులై మనిమా ప్రావిన్సులో ఈ భూకంపంవల్ల 30 మందికి పైగా మరణించారని పలువురు గాయపడ్డారని ఇరాక్ అధికారులు తెలిపారు. ఈసంఖ్య ఇంకా పెరగవచ్చునని భావిస్తున్నారు. భూకంపంవల్ల భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్లను విడిచి వీధుల్లోకి పరుగులు పెట్టారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్ లోని మసీదుల్లో ఆ సమయంలో ప్రార్ధనలు జెరుగుతున్నాయని ఇరాక్ వార్తా సంస్థ తెలిపింది.