దేశంలోని అన్ని గ్రామ పంచాయతీలకు 2019 నాటికి హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన రెండవ దశ నెట్ వర్క్ ఈ రోజు ప్రారంభమౌతుంది.

దేశ రాజధాని ఢిల్లీ , రాజధాని ప్రాంతం లోనూ పెరుగుతన్న కాలుష్యాన్ని నివారించేందుకు చర్యలు కోరుతూ.. దాఖలైన తాజా అభ్తర్ధనలపై ఈ రోజు విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ప్రధానన్యాయమూర్తి దీపక్ మిశ్రా, జస్టిస్ ఖన్వీల్కర్, డిప్యూటీ చంద్రచూఢ్ లతో కూడిన ధర్మాసనం, న్యాయవాది ఆర్.కె. కపూర్ ఢిల్లీ పరిసర రాష్ట్రాల్లో తీవ్రంగా పెరిగిన కాలుష్యాన్ని గురించ సమర్పించిన పిటిషన్ను పరిగణనలోకి తీసుకుంది. కాలుష్యాన్ని విస్మరించలేమని పేర్కొంటూ, ఈరోజు ఈ అభ్యర్థన పై విచారణ జరపాలని నిర్ణయించింది. రోడ్లపై దుమ్ము, గడ్డిని కాల్చి వేయడాన్ని నిరోధించేందుకు కేేంద్రం, రాష్ట్రాలు చర్యలు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని పిటషనర్ తన అభ్యర్థనలో కోరారు.