దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో పొగమంచు పరిస్థితి మెరుగుపండిది. రాజధానిలో పెరుగుతున్న కాలుష్యంపై దాఖలైన పిటిషన్ పై ఈ రోజు విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

దేశంలోని అన్ని గ్రామ పంచాయతీలకు 2019 మార్చి నాటికి హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ సేవలు అందించే లక్ష్యంతో భారత్ నెట్ రెండవ విడత తుది దశ ఆర్టికల్  నెట్ వర్క్ ఈ వేళ ప్రారంభమవుతుంది. 34 వేల కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని చేపడుతున్నారు. భారత్ నెట్ వర్క్ 2వ దశకు సంబంధించిన వివిధ రాష్ట్రాలతో అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిపేందుకు టెలి కమ్యూనికేషన్ శాఖ న్యూఢిల్లీలో జాతి సదస్సు ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రాలకు చెందిన సమాచార, సాంకేతిక మంత్రులు, కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరవుతారు. ఈ విడితి కింద దేశంలో మిగిలిన లక్షా 50 వేల పంచాయతీలకు బ్రాడ్ బ్యాండ్ సేవలను అందజేస్తారు. కాగా భారత్ నెట్ వర్క్ మొదటి విడత కింద ఆర్టికల్ ఫైబర్ నెట్ వర్క్ ద్వారా  దేశంలోని లక్షా 50 వేలకు పైగా గ్రామ పంచాయతీలకు ఒక అధికార ప్రకటన తెలిజేసింది.