31వ ఆసియన్ శిఖరాగ్ర సమావేశం ఈ ఉదయం ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో సహా పలువురు నాయకులు ప్రారంభ సమావేశానికి హాజరయ్యారు.

31వ ఆసియన్ శిఖరాగ్ర సమావేశం ఈ ఉదయం ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో అగ్నేయసియాకు చెందిన సభ్య దేశాల నాయకులు, పలువురు దేశాధినేతలు పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఆసియన్ అధ్యక్షులు ఫిలిప్పిన్స్ అధ్యక్షుడు అయిన రాడ్రిగో డ్యూటర్టే ప్రారంభోపన్యాసం చేస్తూ ఉగ్రవాదం, తీవ్రవాదం సమస్యలు, ఆగ్నయాసియా ప్రాంతంలో శాంతి, సుస్థిరత, భద్రతకు ప్రమాదకరంగా మారాయని చెప్పారు. రాబోయే రెండు రోజుల్లో శిఖరాగ్ర సదస్సు చర్చానీయాంశాలను పరోక్షంగా వెల్లడించారు. తీవ్రవాదం, పైరసీ, మాదకద్రవ్యాల అక్రమ రవాణ ఆరోగ్యం, మహిళలు, యువత సంక్షేమం వంటి పలు అంశాలను సవివరంగా చర్చించాల్సి అవసరం ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం శిఖరాగ్ర సదస్సు కీలక సమావేశం జరుగుతోంది.ఆసియాన్ ప్రారంభ సదస్సుకు హాజరైన అనంతరం, ప్రధానమంత్రి నరేంద్రమోదీ మనీలా సమీపం లోని అంతర్జాతీయ రైస్ రీసెర్చ్ కేంద్రాల్ని సందర్శించారు. ఆయన మహవీర్ ఫిలిప్పీన్స్ ఫౌండేషన్ ను కూడా సందర్శించారు.