జ‌రాత్ శాస‌న‌స‌భ ఎన్నిక‌ల తొలి విడ‌త పోలింగ్‌కు సంబంధించి నోటిఫికేష‌న్ ఈ వేళ జారీ అవుతుంది.

గుజ‌రాత్ శాస‌న‌స‌భ ఎన్నిక‌ల తొలి విడ‌త పోలింగ్‌కు సంబంధించి నోటిఫికేష‌న్ ఈ వేళ జారీ అవుతుంది. ఈ నెల 21వ తేదీ వ‌ర‌కు నామినేష‌న్‌లు స్వీక‌రిస్తారు. ఆ మ‌రునాడున నామినేష‌న్ల ప‌రిశీల‌న ఉంటుంది. నామినేష‌న్ల ఉపసంహ‌ర‌ణ‌కు 24వ తేదీ తుది గ‌డువు. మొత్తం182 శాస‌న‌స‌భ  స్థానాల‌కు గాను 89 స్థానాల‌కు తొలి విడుత‌గా వ‌చ్చే నెల 9వ తేదీన పోలింగ్ జ‌రుగుతుంది. మిగిలిన 93 నియోజ‌క‌వ‌ర్గాల‌కు వ‌చ్చే నెల 14న పోలింగ్ నిర్వ‌హిస్తారు. హిమాచల్‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ ఎన్నిక‌ల ఓట్ల‌తో పాటు వ‌చ్చే నెల 18న ఓట్లు లెక్కిస్తారు.  హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ‌కు ఒకే ద‌శలో గ‌త‌వారం పోలింగ్ జ‌రిగింది.