దేశ ప్ర‌థ‌మ ప్ర‌ధాన‌మంత్రి పండిట్ జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ 128వ జయంతిని ఈ వేళ జ‌రుపుకుంటున్నారు.

దేశ ప్ర‌థ‌మ ప్ర‌ధాన‌మంత్రి పండిట్ జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ 128వ జయంతిని ఈ వేళ జ‌రుపుకుంటున్నారు. రాష్ట్ర‌ప‌తి రామ్‌నాధ్‌కోవింద్‌, ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ నివాళుల‌ర్పించారు.  ఢిల్లీలోని శాంతివ‌నంలోని ఆయ‌న స‌మాధివ‌ద్ద మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్‌ముఖ‌ర్జీర‌, మాజీ ప్ర‌ధాన‌మంత్రి మ‌న్మోహ‌న్‌సింగ్‌, ఇత‌ర ప్ర‌ముఖులు శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు.  పండిట్ జవ‌హ‌ర్ లాల్ నెహ్రూ దేశాభివృద్ధికి అందించిన సేవ‌లు వివ‌రిస్తూ కార్యక్ర‌మాలు ఏర్పాట‌వుతున్నాయి. ఆయ‌న జయంతిని బాల‌ల దినోత్స‌వంగా జ‌రుపుకుంటున్నారు.