మ‌నీలాలో జ‌రుగుతున్న ఆసియాన్ స‌ద‌స్సు స‌ద‌ర్భంగా 5 కీల‌క దేశాల అధినేత‌లతో ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌మోదీ ఈరోజు ద్వైపాక్షిక స‌మావేశాలు నిర్వ‌హించారు.

మనీలాలో ఆసియాన్ సదస్సు సందర్భంగా అయిదు కీలక దేశాల అధినేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. ఫిలిఫ్పైన్స్ రాజ‌ధాని మ‌నీలాలో ఆసియాన్ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ, అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ఫిలిఫ్పైన్స్ అధ్య‌క్షుడు రోడ్రిగో డ్యూటెర్టేతో నిన్న ద్వైపాక్షిక స‌మావేశాలు జ‌రిపారు. ఈ రోజు ప్రధామంత్రి ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మాల్కం టర్న్ బుల్ తోనూ, వియత్నాం ప్రధానమంత్రి  గూయేం జువాన్ ఫూక్ తోనూ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేయడంపై ఈ సమావేశంలో దృష్టి సారించారు. జపాన్ ప్రధానమంత్రి షింజో అబేతో చర్చల్లో ప్రత్యేక వ్యూహాత్మక, భౌగోళిక భాగస్వామ్యాన్ని పటిష్టం చేయడం పైన చర్చించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియచేసింది.. బ్రూనై సుల్తాన్ దారుస్సలాం హస్సన్ అల్ బొల్కియాతో ప్రధమంత్రి జరిపిన చర్చల్లో వాణిజ్యం, పెట్టుబడి, పునర్వినియోగ ఇంధనం సంస్కృతి ప్రజా సంబంధాల పటిష్టతకు సహకారం గురించి చర్చించారు. న్యూ జీలాండ్ ప్రధానమంత్రిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన జసిండా ఆర్డెన్ తో కూడా మోదీ సమావేశమై ఆమెకు ఎన్నికల్లో విజయం పట్ల శుభాకాంక్షలు తెలియచేశారు.