సిరియా ఉత్త‌ర ప్రాంతంలో తీవ్ర‌వాదుల అదుపులో ఉన్న ప‌ట్ట‌ణంపై విమాన దాడుల‌లో 53 మంది మ‌ర‌ణించారు.

సిరియాపై ఈ నెలాఖ‌రులో జ‌ర‌గ‌నున్న శాంతి చ‌ర్చ‌ల‌లో ప్ర‌గ‌తి సాధించ‌గ‌లుగుతామ‌ని ఆశాభావంతో ఉన్న‌ట్లు ర‌ష్యా అధ్జ్ఞ‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌; ట‌ర్కీ, అధ్య‌క్షుడు రీసెప్ త‌యిప్ ఎర్దోగాన్ చెప్పారు. ర‌ష్యా ద‌క్షిణ ప్రాంతంలోని సోచి న‌గ‌రంలో నిన్న స‌మావేశ‌మైన అనంత‌రం విలేఖర్ల‌తో మాట్లాడుతూ వారు సిరియాలో మొత్తంమీద పోరాటం స్థాయి త‌గ్గిన‌ట్లుగా గోచ‌రిస్తుంద‌ని చెప్పారు. ట‌ర్కీతో క‌లిసి తాము చేస్తున్న శాంతి ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తున్నాయ‌ని, హింసాకాండ త‌గ్గి అంత‌ర్ సిరియా చ‌ర్చ‌ల ప్ర‌గ‌తికి సానుకూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతోంద‌ని ర‌ష్యా అధ్జ్ఞ‌క్షుడు పుతిన్ అన్నారు.  ఈ పోరాటానికి రాజ‌కీయ ప‌రిష్కారం కావాల‌ని ఇద్ద‌రూ అంగీక‌రించిన‌ట్లు ఎర్దోగాన్ తెలియ‌చేశారు. జెనీలో ఈనెల‌ఖారులో జ‌ర‌గ‌న్నున్న శాంతి చ‌ర్చ‌ల గురించి ఇద్ద‌రూ ఆశాభావంతో వున్నారు. ర‌ష్యా, సిరియా అధ్య‌క్షుడు బ‌ష‌ర్ అల్ అస‌ద్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌గా – ట‌ర్కీ ప్ర‌భుత్వ వ్య‌తిరేక ద‌ళాల‌కు మ‌ద్ద‌తు అందిస్తోంది. రెండు దేశాలు క‌లిసి సిరియాలో కాల్పుల విరమ‌ణ ఒప్పందాన్ని అమ‌లులోకి తెచ్చాయి.